నకిలీ బాబా వలలో ఒంటరి మహిళ... మంత్రాల పేరిట నమ్మించి ఎంతపని చేసాడంటే...

విజయవాడ : మంత్రాలకు చింతకాయలే రాలవన్నది జగమెరిగిన సామెత. కానీ మంత్రాలతో ఏకంగా మనిషినే బ్రతికిస్తానంటూ నమ్మించి వివాహితను వలలో వేసుకున్న ఓ నకిలీ జ్యోతిష్కుడు మోసగించాడు.

First Published Aug 7, 2022, 10:06 AM IST | Last Updated Aug 7, 2022, 10:06 AM IST

విజయవాడ : మంత్రాలకు చింతకాయలే రాలవన్నది జగమెరిగిన సామెత. కానీ మంత్రాలతో ఏకంగా మనిషినే బ్రతికిస్తానంటూ నమ్మించి వివాహితను వలలో వేసుకున్న ఓ నకిలీ జ్యోతిష్కుడు మోసగించాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వెలుగుచూసింది. పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల గ్రామానికి చెందిన కొండ్రు వెంకటమ్మ భర్త సుధాకర్ కొంతకాలం క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. ఎలాగో ఈ విషయం తెలుసుకున్న నకిలీ జ్యోతిష్కుడు వెంకటమ్మ అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. తన మంత్రశక్తితో నీ భర్తను బ్రతికిస్తానని చెప్పడంతో నమ్మిన వెంకటమ్మ భారీగా డబ్బుులు ముట్టజెప్పింది. అయితే ఈ విషయం తెలిసి స్థానికులు మరోసారి డబ్బుల కోసం వచ్చిన సదరు జ్యోతిష్కుడి శిష్యుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.