నాలుగేళ్ళ పాపపై తాగుబోతు బాబాయ్ అత్యాచారయత్నం... కొట్టిచంపిన కుటుంబసభ్యులు

విజయవాడ : మద్యంమత్తు ఓ మనిషిని మృగంలా మార్చి చివరకు ప్రాణాలనే బలితీసుకుంది.

First Published Jul 29, 2022, 11:01 AM IST | Last Updated Jul 29, 2022, 11:01 AM IST

విజయవాడ : మద్యంమత్తు ఓ మనిషిని మృగంలా మార్చి చివరకు ప్రాణాలనే బలితీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కూతురు వరసయ్యే చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడికి చితకబాదడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ఇడుపులపాటి దాసు (32) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన అతడు కూతురు వరసయ్యే నాలుగేళ్ళ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. మానవ బంధాలకే మచ్చతెచ్చేలా చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడగా గుర్తించిన కుటుంబసభ్యులు దాసును చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ దాసు ఇంట్లోకి వెళ్లిన కాస్సేపటికే మృతిచెందాడు.