Asianet News TeluguAsianet News Telugu

రేపల్లెలో పసిపాప మృతి... డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబం ఆందోళన

బాపట్ల :  వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారి నిండుప్రాణాలను బలితీసుకుందని ఆరోపిస్తూ బాపట్ల జిల్లా రేపల్లెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. 

First Published Nov 15, 2022, 1:16 PM IST | Last Updated Nov 15, 2022, 1:16 PM IST

బాపట్ల :  వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారి నిండుప్రాణాలను బలితీసుకుందని ఆరోపిస్తూ బాపట్ల జిల్లా రేపల్లెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. నాలుగురోజుల క్రితం నాలుగునెలల బాలుడిని వైద్యంకోసం రేపల్లెలోని వి.యన్.ఎమ్ పిల్లల హాస్పిటల్లో చేర్చారు కుటుంబసభ్యులు. అయితే చిన్నారి పరిస్థితి రోజురోజుకు మరింత విషమిస్తున్నా తమకు చెప్పకుండా వైద్యం అందించారని... మెరుగైన ట్రీట్మెంట్ అందక పసివాడి ప్రాణం పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను పొట్టనపెట్టుకుందంటూ బాధిత కుటుంబం హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగింది. చిన్నారి మృతదేహంవద్ద ఆ కుటుంబం రోదిస్తున్న తీరు అక్కడున్నవారికీ కన్నీరు తెప్పిస్తోంది.