Palnadu Accident:ఇటుక లోడ్ ట్రాక్టర్, లారీ ఢీ... నలుగురికి తీవ్ర గాయాలు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లిలోని ఫాతిమా బీఈడీ కాలేజ్ వద్ద ఇటుక లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్డింది.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లిలోని ఫాతిమా బీఈడీ కాలేజ్ వద్ద ఇటుక లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్డింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వెళ్లగా వేగంగా వచ్చిన లారీ డ్రైవర్ అది గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు చెబుతున్నారు. ట్రాక్టర్, లారీ ధ్వంసమయ్యాయి.