తాడిపత్రిలో దాడి.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇవీ...
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నివాసముంటున్న జె.సి. వర్గీయుడు తిరుపాల్ రెడ్డి ఇంటి బయట కూర్చుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని యువకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నివాసముంటున్న జె.సి. వర్గీయుడు తిరుపాల్ రెడ్డి ఇంటి బయట కూర్చుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని యువకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో అతని భార్య పిల్లలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే జె.సి. దివాకర్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం మాజీ ఎంపీ జె.సి.దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయాన్నే ఇలాంటి సంఘటన జరగటం చూస్తూంటే, ఇది తిరుపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కాదని, నలభై ఏళ్ల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు ఖచ్చితమైన విచారణ చేయకపోతే, భవిష్యత్తులో జరగబోయే పాపాలన్నిటికి పోలీసులే కారణం అవుతారన్నారు.