Oion Price : సబ్సిడీ ఉల్లిపాయల్లో సగం పొట్టే ఉంది...తంగిరాల సౌమ్య
కృష్ణాజిల్లా నందిగామ రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి అమ్మకాలను మాజీ ఎంఎల్ఏ తంగిరాల సౌమ్య పర్యవేక్షించారు.
కృష్ణాజిల్లా నందిగామ రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి అమ్మకాలను మాజీ ఎంఎల్ఏ తంగిరాల సౌమ్య పర్యవేక్షించారు. అందరితోపాటు క్యూలైన్లో నిలబడి ఉల్లిపాయలు కోనుగోలు చేశారు. క్యూలో నిలబడిన వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉల్లిపాయలు నేల టపాకాయల సైజులో ఉన్నాయని, ఉల్లిపాయల్లో సగం పొట్టే ఉందని విమర్శించారు. తూతూమంత్రంగా కాకుండా నాణ్యమైన ఉల్లిపాయ అందించాలని కోరారు.