ఫుడ్ డెలివరీ బాయ్ ని నడిరోడ్డుపై చితక్కొడుతూ... గుంటూరులో తాగుబోతు యువకుల హల్ చల్
గుంటూరులోని పట్టాభిపురంలో కొందరు తాగుబోతు యువకులు అర్ధరాత్రి హల్ చల్ చేసారు.
గుంటూరులోని పట్టాభిపురంలో కొందరు తాగుబోతు యువకులు అర్ధరాత్రి హల్ చల్ చేసారు. ఒంటరిగా వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్ ని పట్టుకుని నలుగురైదుగురు యువకులు నానా హంగామా సృష్టించారు. యువకుడు తాగి వుండటంతో రోడ్డుపై వెళుతున్నవారు చూస్తూ వుండిపోయారు తప్ప దాడిని ఆపలేదు. చివరకు ఓ మహిళ ధైర్యం చేసి తాగుబోతు యువకుల నుండి డెలివరీ బాయ్ ని కాపాడారు. ఆమె వీడియో తీయడంతో డెలివరీ బాయ్ ని వదిలి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పట్టాభిపురం పోలీసులు విచారణ చేపట్టారు.