Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యూరులో చిల్లర దొంగతనం... పూలమొక్కలు చోరీచేస్తూ అడ్డంగా బుక్కైన దంపతులు

పెనమలూరు : భారీగా డబ్బులో, బంగారమో లేక మరేదైనా విలువైన వస్తువునో దొంగిలిస్తుంటారు కరుడుగట్టిన దొంగలు.

First Published Dec 22, 2022, 2:21 PM IST | Last Updated Dec 22, 2022, 2:21 PM IST

పెనమలూరు : భారీగా డబ్బులో, బంగారమో లేక మరేదైనా విలువైన వస్తువునో దొంగిలిస్తుంటారు కరుడుగట్టిన దొంగలు. ఇక చిల్లరదొంగలు చిన్నచిన్న వస్తువులను దొంగిలిస్తుంటారు. కానీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో పూల మొక్కలను దొంగిలించిన దొంగలను ఏమనాలి. ముందుగా ప్లాన్ వేసుకుని మరీ స్కూటీపై వచ్చిన దంపతులు ఓ స్కానింగ్ సెంటర్ ప్రాంగణంలోని గులాబీ మొక్కలను దొంగిలించారు. ఈ విచిత్ర దొంగతనం సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. ఉయ్యూరు పట్టణంలోని కాటూరు రోడ్డులో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ బయట అందమైన మొక్కలను కుండీల్లో పెంచుతున్నారు. అయితే ఈ పూలమొక్కలపై మనసుపడ్డ దంపతులు ఎవరూలేని సమయంలో స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చి మొక్కలను దొంగిలించారు. భార్య స్కూటీపై కూర్చుని అటువైపు ఎవరైనా వస్తున్నారేమో గమనించగా భర్త మెల్లగా వెళ్లి పూలమొక్కలను దొంగిలించారు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.