Asianet News TeluguAsianet News Telugu

కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ పడమట కృష్ణలంకకు చెందిన విద్యార్థులు యనమలకుదురు సమీపంలోని కృష్ణానదిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. 

First Published Dec 17, 2022, 12:20 PM IST | Last Updated Dec 17, 2022, 12:20 PM IST

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ పడమట కృష్ణలంకకు చెందిన విద్యార్థులు యనమలకుదురు సమీపంలోని కృష్ణానదిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు గుర్తించారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. తొలుత ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతున్న క్రమంలో ఒడ్డున ఉన్న మరో నలుగురు విద్యార్థులు అతన్ని కాపాడేందుకు వెళ్లి నీటమునిగారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితులంతా విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన వారిలో బాజీ, హుస్సేన్, కామేషు, మున్నా, బాలు..అనే విద్యార్థులు ఉన్నట్లు నిర్దారించారు.