Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో మొట్టమొదటి 'ఫిష్ ఆంధ్రా' మాల్ ప్రారంభం...

గుంటూరు : ప్రజలకు పోషక విలువలతో కూడిన మత్య ఉత్పత్తులను అందించడమే కాదు ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ సర్కార్ 'ఫిష్ ఆంధ్రా' మాల్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

గుంటూరు : ప్రజలకు పోషక విలువలతో కూడిన మత్య ఉత్పత్తులను అందించడమే కాదు ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ సర్కార్ 'ఫిష్ ఆంధ్రా' మాల్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో మొట్టమొదటి ఫిష్ ఆంధ్రా మాల్ ఏర్పాటయ్యింది. ఈ మాల్ ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్య శాఖ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి రంగనాధబాబు ఫిష్ ఆంధ్రా మాల్స్ వ్యాపారం గురించి  వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చేఏడాది మార్చికల్లా 4 వేల ఫిష్ మార్కెట్ యూనిట్ల ఏర్పాటుకు మత్స్య శాఖ ప్రణాళికలు రచిస్తోందన్నారు. వీటికి సరుకు సప్లై చేసేందుకు 26 జిల్లాల్లో 26 హబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిష్ ఆంధ్రా మాల్స్ ద్వారా వ్యాపారం చేసేవారికి  ప్రభుత్వం పూర్తి గైడెన్స్ ఇస్తుందని మత్స్య శాఖ అధికారి రంగనాధబాబు తెలిపారు. 
 

Video Top Stories