ఎన్టీఆర్ జిల్లాలో అగ్నిప్రమాదం... ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదురుగా గల ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే ఇంట్లో పడుకున్న నలుగురు కుటుంబసభ్యులు మంటలను గుర్తించి బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలను అదుపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా అప్పటికే ఇళ్లంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమయిపోయింది. ఇంట్లోని నగదు, బంగారంతో పాటు వస్తువులు కాలిబూడిదై ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.