Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... తగలబడిపోతున్న స్పిన్నింగ్ మిల్లు

కృష్ణా జిల్లా  గన్నవరం మండలం తెంపల్లి లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా  గన్నవరం మండలం తెంపల్లి లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్పిన్నింగ్ మిల్లులో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు అంతకంతకు పెరుగుతూ మిల్లు మొత్తాన్ని వ్యాపించాయి.  

అగ్నిప్రమాదాన్ని గమనించిన వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేయలేక కష్టాలు పడుతున్నా ఫైర్ సిబ్బంది. ఈ స్పిన్నింగ్ మిల్లు పక్కనే పలు ఫ్యాక్టరీ లు ఉండటంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.