సీఎం జగన్ పాల్గొన్న నాడు-నేడు కార్యక్రమంలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి: నాడు-నేడు తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన 15,715 ప్రభుత్వ స్కూళ్లను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా  పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అపసృతి చోటుచేసుకుంది. సభా ప్రాంగణం పక్కనే అమర్చిన జనరేటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యింది. మంటల చెలరేగి పొగలు  వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా చూశారు. జనరేటర్ దగ్దం కారణంగా సభా ప్రాంగణంలో కొద్దిసేపు విద్యుత్ అంతరాయం కలగ్గా అధికారులు వెంటనే  పునరుద్ధరించారు

First Published Aug 16, 2021, 4:17 PM IST | Last Updated Aug 16, 2021, 4:17 PM IST