ప్రమాదం... గ్యాస్ సిలిండర్ పేలి రెండిళ్లు దగ్దం
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటురు గ్రామంలో ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటురు గ్రామంలో ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో గ్యాస్ పేలడంతో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే సకాలంలో అగ్నిమాపక శాఖ బృందం ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.