నడిరోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని... ఫైన్సాన్స్ రికవరి ఏజెంట్స్ దౌర్జన్యం చూడండి...
విజయవాడ : ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల తాళలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
విజయవాడ : ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల తాళలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికి పలు ఫైనాన్స్ సంస్థలు తీరుమార్చుకోకుండా వేధింపులు కొనసాగిస్తునే వున్నాయి. వీరిని చూసి స్పూర్తిపొందారో ఏమో వెహికిల్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఇదే బాటపట్టాయి. వాహనాల కొనుగోలు సమయంలో తమవద్దే ఫైనాన్స్ తీసుకోవాలంటూ వెంటబడే సంస్ధలు ఆర్థిక సమస్యలతో నెలనెలా ఈఎంఐ సమయానికి కట్టలేకపోయేవారితో చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ రాష్ట్రం కాని రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబం ఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురయ్యింది.
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగచెర్ల మండలంలోని ఓ తండాకి చెందిన రాజేష్ ఖమ్మంలోని ఫైనాన్స్ సంస్థ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేసాడు. కొన్ని నెలవారి వాయిదాలను సరిగ్గానే కట్టినా ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐ కట్టలేకపోయాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ఫైనాన్స్ సంస్థ రికవరీ ఏజెంట్లు అడ్డుకున్నారు. పెండింగ్ ఈఎంఐ మొత్తాన్ని కడితేనే వాహనాన్ని తీసుకెళ్లాలని... లేదంటే స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీంతో రాజేష్ తో పాటు అతడి కుటుంబసభ్యులు కంగారుపడిపోయి రోడ్డుపైనే రూ.30వేలు చెల్లించాల్సి వచ్చింది. కుటుంబసభ్యులంతా వాహనంలో వుండగా ఇలా ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు దురుసుగా వ్యవహరించడంపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.