బావిలోంచి భారీ ఏనుగును ఎలా బయటకు తీసారో చూడండి...
చిత్తూరు : ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి తమ పంటలను నాశనం చేస్తున్నాయంటూ చిత్తూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.
చిత్తూరు : ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి తమ పంటలను నాశనం చేస్తున్నాయంటూ చిత్తూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇలా తమకు నష్టాలను మిగిలిస్తున్న ఓ ఏనుగు ప్రాణాపాయ స్థితిలో వుంటే ఆ అన్నదాత తమకెందుకని వదిలిపెట్టలేదు. ఎంతో ప్రయాసపడి బావిలోంచి ఏనుగును కాపాడి మానవత్వాన్ని చాటారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గాండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ పొలంవద్ద గల బావిలో ఏనుగు పడింది. నీరుతాగడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు బావిలోపడిపోయిన ఏనుగు బయటకు రాలేక విలవిల్లాడిపోయింది. బావిలో ఏనుగును గమనించిన రైతులు అటవీ అధికారుల సాయంతో దాన్ని కాపాడారు. జేసిబితో బావిలోకి పెద్ద కాలువమాదిరిగా తవ్వారు. దీంతో దాంట్లోంచి ఏనుగు బయటపడి అడవిలోకి జారుకుంది.