కొండూరు లో ఉద్రిక్తత... పురుగు మందు డబ్బాలతో అన్నదాతల ఆందోళన
కృష్ణా జిల్లా ఏ కొండూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులు పురుగు మందులు డబ్బాలతో ఆందోళనకు దిగారు.
కృష్ణా జిల్లా ఏ కొండూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులు పురుగు మందులు డబ్బాలతో ఆందోళనకు దిగారు. దళ్వా వరి డబ్బులు చెల్లించడంతో పాటు తరుగు పేరిట కిలోలకు కిలోలు ధాన్యాన్ని తగ్గించడం ఆపాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్, తహసీల్దార్ కు ఇప్పటికే అనేకమార్లు తమ సమస్య చెప్పిన పరిష్కారం లేదని... అందువల్లే పురుగుల మందుతో నిరసనకు దిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.