నకిలీ విత్తన కంపనీలపై అన్నదాతలు కన్నెర్ర... రోడ్డుపై బైఠాయించి ఆందోళన
నకిలీ విత్తనాలను విక్రయించి తమ పంట నష్టానికి కారణమయ్యాయంటూ విత్తనాల కంపనీ, పర్టిలైజర్స్ దుకాణాలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండల రైతులు నిరసనకు దిగారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 60 మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో విసన్నపేట, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రైతులు ఆగ్రహంతో న్యాయం చేయాలంటూ కదంతొక్కడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసనకు దిగిన రైతులని బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. కానీ రూ.20 వేల నష్టపరిహారం చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేసారు. వ్యవసాయ అధికారులు వచ్చి సంప్రదింపులు జరిపిన అనంతరం అన్నదాత సీడ్స్ కంపెనీ ప్రతినిధులు నష్టపోయిన రైతులకు రూ.4500 చెల్లించడానికి సిద్దపడ్డారు. రైతులు మాత్రం అందుకు ససేమిరా అంటూ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.