సొంత భూముల్లో అక్రమంగా రహదారి ఏర్పాటు... రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్న ఎస్సీ రైతులు
మైలవరం: కోర్టులో కేసు విచారణలో వుండగా తమ భూమల్లో రహదారిని నిర్మించడానికి తహసీల్దార్, వీఆర్వో యత్నిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు ఆరోపించారు.
మైలవరం: కోర్టులో కేసు విచారణలో వుండగా తమ భూమల్లో రహదారిని నిర్మించడానికి తహసీల్దార్, వీఆర్వో యత్నిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు ఆరోపించారు. తమ సొంత భూమిలో రహదారి ఏర్పాటు చేయవద్దని బాధిత రైతులు మైలవరం న్యాయస్థానాన్ని గత నెల ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.అయినప్పటికి జి.కొండూరు తహశీల్దార్ ఇంతియాజ్ పాష, వీఆర్వో రమేష్, సచివాలయ రెవెన్యూ అధికారిని నీరజ సదరు భూమిలోకి వచ్చి బెదిరించారని బాధిత రైతులు వాపోయారు. రైతులు గుమిగూడి వారిని చుట్టుముట్టి నిలదీయడంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు అక్కడ నుండి జారుకున్నారు.