రోడ్డును జేసిబితో తవ్వుతూ... ఇబ్రహింపట్నం రైతుల వినూత్న నిరసన

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో క‌‌ృష్ణా నది తీరంలోని పవిత్ర సంగమం రోడ్డును ఇద్దరు రైతులు జేసిబిలతో తవ్వేసారు.

First Published Sep 29, 2022, 2:17 PM IST | Last Updated Sep 29, 2022, 2:17 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో క‌‌ృష్ణా నది తీరంలోని పవిత్ర సంగమం రోడ్డును ఇద్దరు రైతులు జేసిబిలతో తవ్వేసారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం తమ భూమిని తీసుకుని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆగ్రహించిన బాధితులు ఇలా రోడ్డును తవ్వేసే ప్రయత్నం చేసారు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న ఎమ్మార్వో రోడ్డు తవ్వకాన్ని అడ్డుకున్నారు. అప్పటికే తవ్వేసిన చోట మట్టి వేసి సరిచేయించారు. 

తమకు రావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. ఆర్ఎంబి అధికారుల చుట్టూ నష్టపరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరిగినా పలితం లేకపోవడంతో ఇలా రోడ్డును తవ్వాల్సి వచ్చిందన్నారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్కు భూ సేకరణకు సంబంధించిన పూర్తి బిల్లు లభించాయని... అయినా భూములు కోల్పోయినవారికి చెల్లించడం లేదని బాధితులు ఆరోపించారు.