Asianet News TeluguAsianet News Telugu

ప.గో జిల్లాలో దారుణం... వివాహితపై కన్నేసి... బాధిత కుటుంబాన్నే వెలేసి

భీమవరం : ఈ కంప్యూటర్ యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆనాటి ఆటవిక పద్దతులు కొనసాగుతున్నాయి.

First Published Dec 5, 2022, 12:29 PM IST | Last Updated Dec 5, 2022, 12:29 PM IST

భీమవరం : ఈ కంప్యూటర్ యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆనాటి ఆటవిక పద్దతులు కొనసాగుతున్నాయి. ఇలా ఓ వివాహితను వేధించిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు బాధిత కుటుంబాన్నే సామాజిక వెలివేసారు గ్రామపెద్దలు. ఈ అటవిక ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 

ప.గో జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో చెందిన రాణి, సతీష్ దంపతులు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. అయితే పెళ్లయి పిల్లలున్న రాణిపై అదే గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న కనకరావు కన్నేసి వేధింపులకు దిగాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆ కుటుంబంపై కక్ష్యగట్టిన గ్రామపెద్దలు సామాజిక వెలివేత చేసారు. ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా రూ.5,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసారు. ఈ కుటుంబ వెలివేత వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు గ్రామపెద్దలు కనకరావు, మోహన్ రావు లపై కేసు నమోదు చేసారు.