ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం... తల్లీ, ఇద్దరు బిడ్డల దుర్మరణం
విజయవాడ : ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడ : ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తల్లీ, ఇద్దరు పిల్లలు మృతిచెందగా తండ్రి చికిత్స పొందుతున్నారు. విజయవాడలోని కృష్ణలంక బాలాజీ నగర్ కు చెందిన ఈ దంపతులు కుటుంబ కలహాల కారణంగానే పిల్లలతో కలిసి ఇంట్లోనే పురుగుల మందు తాగారు. తీవ్ర అస్వస్ధతకు గురయని వారిని గుర్తించి హాస్పిటల్ కు తరలించగా తల్లీ లక్ష్మి పిల్లలు నాగమణికంఠ, జయ హర్ష ప్రాణాలు కోల్పోయారు. కుటుంబం ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా సూసైడ్ లెటర్ లభించింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.