Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో మేకుల బాబా లీలలివీ... వింత పూజతో ఘరానా మోసం...

మచిలీపట్నం : ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు.

First Published Aug 20, 2023, 1:11 PM IST | Last Updated Aug 20, 2023, 1:11 PM IST

మచిలీపట్నం : ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి పూజలు చేస్తామని కొందరు, మాయమాటలతో మరికొందరు అమాయకులను దొంగ బాబాలు మోసం చేసిన అనేక ఘటనలు చూసాం. కానీ కేవలం నాలుగు మేకులతో ఓ మహిళను బురిడీకొట్టించి ఏకంగా లక్షలు దోచేసాడో కిలాడీ బాబా. ఈ విచిత్ర మోసం 
కృష్ణా జిల్లాలో జరిగింది. 

విజయవాడకు చెందిన సుకర రజని మచిలీపట్నం ఇనుకుదురులో రూ.35 లక్షలు పెట్టి 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలుచేసింది. కొంత లాభాన్ని చూసుకుని తిరిగి ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టగా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. ఇలా స్థలం కొనుగోలు కాకపోవడంతో బాధపడుతున్న ఆమె ఓ బాబాను ఆశ్రయించింది. ఆమె అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని అమ్మకానికి పెట్టిన స్థలంలో  చిన్న దోషం వుందని... నాలుగు వైపుల నాలుగు మేకులు పెట్టి పూజచేస్తే పరిష్కారం అవుతుందని నమ్మించాడు. ఇలా వింత పూజల పేరిట రజని నుండి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు బాబా మౌలాలా. ఆలస్యంగా మౌలాలా మోసాన్ని గుర్తించిన మహిళ ఇనుకుదురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Video Top Stories