Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకున్న వైసీపీ మద్దతుదారులు..

దాడులకు దారి తీసింది. పోలీస్ స్టేషన్ లోనే ఇరువర్గాలు కొట్టుకున్నాయి.

దాడులకు దారి తీసింది. పోలీస్ స్టేషన్ లోనే ఇరువర్గాలు కొట్టుకున్నాయి. వివరాల్లోకి వెడితే బోగతి వర్గీయులు, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పాత కక్షలు ఉన్నాయి. బుధవారం నాడు బొగతి వర్గీయుల  పొలం మధ్య నుండి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు మట్టిని తరలిస్తుండగా బోగతి వర్గీయులు అడ్డుకున్నారు.  దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేయడానికి వెళ్లాయి.  ఇంతలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి చెందిన వారు పోలీస్ స్టేషన్ లోనే దాడికి తెగబడ్డారు.  ఏకంగా స్టేషన్లోనే ఈ దాడికి పాల్పడడంతో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు మొదలవుతాయేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.