Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో దారుణం... ఇద్దరు పిల్లల తల్లయిన హోంగార్డుతో ఎస్సై సహజీవనం

మచిలీపట్నం : ఇద్దరు పిల్లలున్న తనను పెళ్లి పేరుతో నమ్మించిన ఎస్సై నాలుగేళ్ళు సహజీవనం చేసాడని కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళా హోంగార్డు తెలిపింది.

First Published Aug 29, 2022, 4:25 PM IST | Last Updated Aug 29, 2022, 4:25 PM IST

మచిలీపట్నం : ఇద్దరు పిల్లలున్న తనను పెళ్లి పేరుతో నమ్మించిన ఎస్సై నాలుగేళ్ళు సహజీవనం చేసాడని కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళా హోంగార్డు తెలిపింది. ఎలాగే పెళ్లి చేసుకుంటాం కదా అని నమ్మి పిల్లల కోసం దాచుకున్న డబ్బులు కూడా అతడికి ఇచ్చానని ఆమె తెలిపింది. అయితే ఇప్పుడు అవసరం తీరిపోయాక ఎస్సై వదిలించుకోవాలని చూస్తున్నాడని... తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళా హోంగార్డు స్పందన కార్యక్రమంలో పాల్గొని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కొమ్మా కిషోర్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు నాగలక్ష్మి భర్త మృతిచెందండంతో ఇద్దరు పిల్లలతో కలిసి వుంటోంది. ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎస్సై దగ్గరయ్యాడు. ఇలా నాలుగేళ్ళు సహజీవనం చేసామని మహిళ హోంగార్డు తెలిపింది. అవసరం వుందంటూ ఎస్స తనదగ్గరున్న రెండున్నర లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడని ఆమె తెలిపింది. ఇప్పుడేమో పెళ్లి చేసుకోనని... డబ్బులు కూడా తిరిగివ్వనని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను కోరుతోంది.