కృష్ణా జిల్లాలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
రాజకీయ కారణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం మాజీ సర్పంచ్
రాజకీయ కారణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం మాజీ సర్పంచ్, టీడీపీ నేత రామారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఎంపిటిసి ఒక పార్టీ వారు, సర్పంచ్ మరో పార్టీ వారు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని, ఆ మేరకు ఆప్పటి ఎన్నికల్లో ఎంపీటీసీ పదవి ఏకగ్రీవమైందని చెబుతున్నారు.గతంలో కూడా అ నేత మాట ఇచ్చి తప్పారని దాంతో సుమారు 20 లక్షలకు ప్రాంసరీ నోటు, బ్యాంక్ చెక్కు ద్వారా ఒప్పందం జరిగిందని సమాచారం.ప్రస్తుతం జరగుతున్న సర్పంచ్ ఎన్నికల నామినేషన్ లో వారు కూడా నామినేషన్ కు ఏర్పాట్లు చేస్తు బెదిరింపులకు దిగినట్లు దానితో మనస్తాపం చెంది ఆత్మహత్య జరిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన మొన్న జరిగింది.విజయవాడ కామినేని ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావువైఎస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి లు బెదిరింపులకు పాల్పడరని చెబుతున్నారు.