ఆ గ్రామాల్లో ఉపాధి పనులు బంధ్... రోడ్డెక్కిన నిరుపేద కూలీలు

తాడేపల్లి: ఉపాధి హామీ పనులు కొనసాగించాలని కోరుతూ తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉపాధిహామీ కూలీలు ధర్నాకు దిగారు.

First Published Jul 15, 2021, 4:11 PM IST | Last Updated Jul 15, 2021, 4:11 PM IST

తాడేపల్లి: ఉపాధి హామీ పనులు కొనసాగించాలని కోరుతూ తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉపాధిహామీ కూలీలు ధర్నాకు దిగారు. తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, మంగళగిరి మండలంలోని ప్రాతూరు, గుండిమెడ గ్రామాలనుండి ఉపాధి కూలీలు కమిషనర్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తమకు ఉపాధి హామీ పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి, మంగళగిరి నగర పాలక సంస్థగా ఏర్పడటంతో వాటి విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఉపాధి కోల్పోయిన గ్రామస్తులు తిరిగి ఉపాధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.