పచ్చని ప్రకృతి ఒడిలో పొగమంచు చీల్చుకుంటూ... పలమనేరులో ఏనుగుల గుంపు సందడి
చిత్తూరు : తెల్లవారుజామున పొగమంచును చీల్చుకుంటూ వంపులు తిరుగిన రోడ్డుపై పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళుతున్న వాహనదారులకు మరో బోనస్ లభించింది.
చిత్తూరు : తెల్లవారుజామున పొగమంచును చీల్చుకుంటూ వంపులు తిరుగిన రోడ్డుపై పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళుతున్న వాహనదారులకు మరో బోనస్ లభించింది. పొగమంచులో ప్రత్యక్షమైన ఏనుగుల గుంపు పచ్చటి చెట్ల మధ్యలో సందడి చేస్తుంటే చూస్తుండిపోయారు. ఈ అద్భుత అవకాశం చిత్తూరు జిల్లా పలమనేరు వాసులకు లభించింది. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున పలమనేరు సమీపంలోని మొసలిమడుగు వద్ద 22 ఏనుగులతో కూడిన గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఈ ఏనుగుల గుంపును కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఏపీలోని చిత్తూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల గుంపులు తరచూ సంచరిస్తున్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతాల నుండి ఏనుగులు ఆహారం లేదా నీటి కోసం జనావాసాలకు వస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇలాగే ఇప్పుడు కూడా దారితప్పిన ఏనుగుల గుంపు జవాసాల మధ్యకు వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు.
ట్రాక్టర్ సహయంతో ఏనుగుల గుంపును అడవిలోకి పంపారు.