Asianet News TeluguAsianet News Telugu

నిండు గర్భిణీ అయినా.. కరోనా సేవలో డాక్టర్ భాగ్యరేఖ...

విజయనగరం జిల్లా జామి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో పనిచేస్తున్న డాక్టర్ భాగ్యరేఖ నిండుగర్భిణి. 
First Published Apr 15, 2020, 5:11 PM IST | Last Updated Apr 15, 2020, 5:11 PM IST

విజయనగరం జిల్లా జామి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో పనిచేస్తున్న డాక్టర్ భాగ్యరేఖ నిండుగర్భిణి. కరోనావైరస్ కు భయపడకుండా, ప్రసూతి సెలవులు తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోకుండా.. తన ఆరోగ్య కేంద్రం పరిథిలో కరోన ప్రబలకుండా ప్రతి నిత్యం విధులు నిర్వహిస్తోంది.  లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతూ, ఆరోగ్య సమస్యలతో వస్తున్న సుమారు 150 మంది రోగులను ప్రతిరోజూ తమ ఆరోగ్య కేంద్రంలో పరీక్షించి కరోన పై వారికి తగు సూచనలు ఇస్తున్నారు. ఈ సమయంలో డాక్టర్ గా బాధ్యత మరిచిపోని డాక్టర్ భాగ్యరేఖ ను చూసి పలువురు అభినందిస్తున్నారు.