ఖాళీలు బ్లాక్ చేయటం కొత్తేమి కాదు: విద్యాశాఖ మంత్రి

విజయవాడ: టీచర్ల బదిలీలపై టీడీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు.

First Published Dec 15, 2020, 6:16 PM IST | Last Updated Dec 15, 2020, 6:16 PM IST

విజయవాడ: టీచర్ల బదిలీలపై టీడీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గత టీడీపీ హయాంలో బదిలీలు జరిగినప్పుడు జిల్లాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడి ఎవరు సస్పెండ్ అవుతారో అని భయపడే పరిస్థితి వుండేదన్నారు. కానీ ఇప్పుడు తమ హయాంలో అంతా పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఖాళీలు బ్లాక్ చేయటం ఇప్పుడు కొత్తేమి కాదని... తాము ఏదీ దాచటం లేదని... బ్లాక్ చేసిన వివరాలు కూడా వెల్లడిస్తున్నామన్నారు. మొత్తం 4 కేటగిరిల్లో 16008ఖాళీలు బ్లాక్ చేశామని.. ఆప్షన్ పెట్టుకునేందుకు ఖాళీలు మొత్తం 32889 ఉన్నాయన్నారు. వెబ్ ఆప్షన్ కోసం మరొక రోజు అవకాశం ఇస్తామన్నారు విద్యాశాఖ మంత్రి.