గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈడీ రైడ్స్... డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు
అమరావతి : గుంటూరు జిల్లాలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా తాజాగా ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దాడులు కలకలం రేపుతున్నాయి.
అమరావతి : గుంటూరు జిల్లాలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా తాజాగా ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దాడులు కలకలం రేపుతున్నాయి. హాస్పిటల్ పాత మేనేజ్ మెంట్ లోని కొందరు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేపట్టారు. కరోనా సమయంలో మ్యానువల్, నకిలీ రసీదులతో నిధులు దారిమళ్లించినట్లుగా అభియోగాలున్నాయి. అలాగే ఎంబిబిఎస్ ఫీజుల, బిల్డింగ్ నిర్మాణం పేరిట కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ వంటి వారిపై గతంలోనే కేసు నమోదయ్యాయి. తాజాగా నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్ ఇంటిలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.