ఎమ్మెల్యే ఆర్కేకు పసుపు కుంకుమ పెట్టి... గాజులు తొడిగి...: డ్వాక్రా మహిళల వినూత్న నిరసన
తాడేపల్లి: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి పసుపు కుంకుమ, గాజులు సమర్పించి నిరసన తెలిపారు డ్వాక్రా సంఘాల మహిళలు.
తాడేపల్లి: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి పసుపు కుంకుమ, గాజులు సమర్పించి నిరసన తెలిపారు డ్వాక్రా సంఘాల మహిళలు. ఎమ్మెల్యే ఆర్కే తమకు రుణాలు ఇవ్వవద్దని బ్యాంకులకు హుకుం జారీ చేశారని మహిళలు ఆరోపించారు. గత ఆరు నెలలగా డ్వాక్రా రుణాలు ఇవ్వకుండా బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారని... దీనిపై గట్టిగా నిలదీయగా ఎమ్మెల్యే ఆర్కే రుణాలు ఇవ్వవద్దని ఆదేశించారని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది చెప్పినట్లు తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు తెలిపారు. పసుపు కుంకుమ, గాజులు స్వీకరించి డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలిగా ఎమ్మెల్యే ఆర్కే చేరాలంటూ బ్యాంకు ముందు నిరసనకు దిగారు డ్వాక్రా గ్రూప్ మహిళలు.