Asianet News TeluguAsianet News Telugu

కన్న కొడుక్కే జరిమానా విధించిన సీఐ...

కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లగించినవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు.

First Published May 13, 2021, 6:00 PM IST | Last Updated May 13, 2021, 6:02 PM IST

కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లగించినవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు..చట్టం ముందు రాగ ద్వేషాలు ఉండవని ఎవరైనా ఒకటే అని నిరూపించారు చిత్తూరు జిల్లా పలమనేరు CI ..కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఒక యువకుడిని పోలీస్ కానిస్టేబుల్ ఆపి పట్టుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న CI జయరామయ్య కి అప్పగించగా,  అతను స్వయంగా CI జయరామయ్య కొడుకు రాహుల్ అవటం, అయినా కూడా  విధి నిర్వహణలో రాజీ పడని అయన కన్న కొడుకు అయినా శిక్ష పడాలిసిందే అని కొడుక్కి 125 రూపాయల ఫైన్ విధించారు..అంతే కాకుండా మరోసారి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..