Solar eclipse : శ్రీశైలం ఆలయ ద్వారాల మూసివేత
సూర్య గ్రహణం సందర్భంగా రేపు ఉదయం 11.30గంటలకు శ్రీశైలం ఆలయ ద్వారాల మూసివేయనున్నారు.
సూర్య గ్రహణం సందర్భంగా రేపు ఉదయం 11.30గంటలకు శ్రీశైలం ఆలయ ద్వారాల మూసివేయనున్నారు. సూర్యగ్రహణం అనంతరం ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ప్రాతః కాల పూజలు జరిపించి ఒంటిగంట నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తెలిపారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు అయిన సాక్షి గణపతి హటకేశ్వరం పాలధార, పంచదార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాలు కూడా మూసివేశారు.