జగన్ ప్లెక్సీతో సెల్ టవరెక్కి... మంగళగిరిలో డిఎస్సి-1998 అభ్యర్థుల ఆందోళన
గుంటూరు : డీఎస్సీ-1998 అభ్యర్థులు సీఎం జగన్ ప్లెక్సీలతో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగడంతో మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గుంటూరు : డీఎస్సీ-1998 అభ్యర్థులు సీఎం జగన్ ప్లెక్సీలతో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగడంతో మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాలతో ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన కౌన్సిలింగ్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా పులివెందులకు చెందిన రమేష్, నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ వల్ల ఎస్సీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని... రోస్టర్ పద్ధతిలో భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసారు. అసెంబ్లీలో ప్రకటించినట్లు 5887 మంది అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలంటూ సీఎం జగన్ పోస్టర్ తో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు. వీరి ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.