Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో తాగుబోతు యువతి హల్చల్... పోలీసులపైనే దాడిచేస్తూ వీరంగం

విశాఖపట్నం : గంజాయి మత్తులో తూగుతూ విశాఖపట్నం నడిరోడ్డుపై ఓ యువతి హల్చల్ చేసింది.

First Published Dec 15, 2022, 10:03 AM IST | Last Updated Dec 15, 2022, 10:03 AM IST

విశాఖపట్నం : గంజాయి మత్తులో తూగుతూ విశాఖపట్నం నడిరోడ్డుపై ఓ యువతి హల్చల్ చేసింది. ఆర్కే బీచ్ వద్ద బహిరంగ ప్రదేశంలో బీర్ తాగుతున్న యువతిని విధుల్లో వున్న త్రీటౌన్ ఏఎస్సై గమనించి దగ్గరికెళ్లి మందలించే ప్రయత్నం చేసాడు. దీంతో అప్పటికే గంజాయి, మద్యం మత్తులో తూగుతున్న యువతి ఏఎస్సైని లం... కొడకా అంటూ దుర్భాషలాడింది. అంతేకాకుండా బీర్ బాటిల్ తో కొడుతూ... కాలితో తంతూ చాలా దారుణంగా ప్రవర్తించింది. యువతి దాడిలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. ఏఎస్సై పోలీస్ ఉన్నతాధికారులు సమాచారమివ్వగా మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా 149 వచ్చింది. దీంతో యువతిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి తోసారు పోలీసులు.