మృత్యువును జయించిన తాగుబోతు... ఎలాగో ఈ వీడియో చూడండి
శ్రీకాళహస్తి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఓ తాగుబోతు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.
శ్రీకాళహస్తి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఓ తాగుబోతు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఫుల్లు కిక్కులో సరిగ్గా నడవలేని స్థితిలో తూగుతూ మొదటి అంతస్తుపై నుండి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు. అయితే అతడు పడగానే ట్రాన్స్ ఫార్మర్ డ్రిప్ అయి విద్యుత్ నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శివాలయం సమీపంలోనే చోటుచేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ పై పడిపోయిన తాగుబోతును కిందకు దించిన స్థానికులు స్వల్పంగా గాయపడినట్లు గుర్తించి వెంటనే 108కు ఫోన్ చేశారు. ప్రస్తుతం అతడు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.