చిన్న వర్షానికే చెరువులను తలపిస్తున్న రోడ్లు... ఇదీ విజయవాడలో పరిస్థితి

విజయవాడ : భారీ వర్షమైనా, చిన్నపాటి వర్షమైనా విజయవాడలో రోడ్లు చెరువును తలపించడం సర్వసాధారణంగా మారింది.

First Published Aug 29, 2022, 12:11 PM IST | Last Updated Aug 29, 2022, 12:11 PM IST

విజయవాడ : భారీ వర్షమైనా, చిన్నపాటి వర్షమైనా విజయవాడలో రోడ్లు చెరువును తలపించడం సర్వసాధారణంగా మారింది. డ్రైనేజి పూడికతీత, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో వర్షం కురిసిందంటే చాలు మురుగునీరు పొంగిపొర్లుతోంది. ఇలా ఇవాళ ఉదయం చిన్నపాటి వర్షం కురవడంతో డ్రైనేజి పొంగి కోమల విలాస్ సెంటర్, ప్రధాన వీధి జలమయమయ్యాయి. దీంతో ఆ మురుగు నీటిలోనే ప్రయాణిస్తూ స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడలో దారుణ పరిస్థితికి రోడ్డుపై నిలిచిన ఈ మురుగు నీరే అద్దం పడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి డ్రైనేజి వ్యవస్థను పటిష్టం చేయాలని విజయవాడవాసులు కోరుతున్నారు