మాస్కులు లేకుండా కనిపిస్తే కఠినచర్యలే.. కలెక్టర్ ఇంతియాజ్

రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ. ఎండి. ఇంతియాజ్ తెలిపారు. 

First Published Apr 23, 2020, 3:10 PM IST | Last Updated Apr 23, 2020, 3:10 PM IST

రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ. ఎండి. ఇంతియాజ్ తెలిపారు. కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై బుధవారం కలెక్టర్ ఇంతియాజ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  ప్రజా ఆరోగ్యాన్ని , కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మూడు చొప్పున మాస్కులు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో రెడ్ జోన్ గా ఉన్న విజయవాడ , పెనమలూరు . గొల్లపూడి , జగ్గయ్యపేట , మచిలీపట్నం , నూజివీడు మండలాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.