Asianet News TeluguAsianet News Telugu

ఇళ్ళు ఇస్తారో లేక డబ్బులిస్తారో తేల్చండి... లేదంటే ఆందోళన తప్పదు: టిడిపి నేతల హెచ్చరిక

విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కలను నిజం చేయడానికి అధునాతన టెక్నాలజీతో 30లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించామని టిడిపి నేత బోండా ఉమ తెలిపారు. 

విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కలను నిజం చేయడానికి అధునాతన టెక్నాలజీతో 30లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించామని టిడిపి నేత బోండా ఉమ తెలిపారు. అయితే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడ్కో(ఆంధ్ర ప్రదేశ్ టౌన్ షిప్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయడమే కాదు మేము పూర్తి చేసిన ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వలేదని అన్నారు. ఈ టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు కేవలం విజయవాడలోనే రూ.20 కోట్లు కట్టారని... రాష్ట్రంలో రూ.900 కోట్లు కట్టారని ఉమ తెలిపారు. కాబట్టి లబ్దిదారులకు అన్యాయం చేయకుండా ఇళ్లను అందివ్వాలని... లేదంటే వారు కట్టిన డబ్బులు తిరిగివ్వాలని టిడ్కో ఎండిని ఉమ కోరారు. ఈ మేరకు టిడ్కో ఎండిని కలిసి బోండా ఉమతోపాటు గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా కలిసి వినతిపత్రం ఇచ్చారు. 

Video Top Stories