Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి పోలీస్ స్టేషన్ లో డీఐజీ తనిఖీలు..

గుంటూరు జిల్లా : గుంటూరు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ త్రివిక్రమ వర్మ ఐపీఎస్ వార్షిక తనీఖీల్లో భాగంగా మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీస్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. 

First Published Sep 2, 2022, 11:51 AM IST | Last Updated Sep 2, 2022, 11:51 AM IST

గుంటూరు జిల్లా : గుంటూరు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ త్రివిక్రమ వర్మ ఐపీఎస్ వార్షిక తనీఖీల్లో భాగంగా మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీస్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. సర్కిల్ ఆఫీస్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్ లలో నిర్వహిస్తున్న కేసుల డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్ ఆఫీస్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను, రిసెప్షన్ కౌంటర్ రిజిస్టర్లను, కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా దర్యాప్తు పూర్తయిన గ్రేవ్ కేసులలో కచ్చితంగా ముద్దాయిలకు శిక్ష పడే విధంగా కోర్టులో చార్జి షీటు ఫైలు చేయాలని అధికారులకు సూచించారు.

లైసెన్స్ లేకుండా చిట్టి వ్యాపారాలు చేసి వారిని నమ్మవద్దని, అత్యాశకు పోయి మోసపోవద్దని డిఐజి  తెలిపారు. గ్రేవ్ కేసులను సమీక్షించారు. క్లూస్ లేని కేసులను ఎఫర్ట్స్ పెట్టి ఛేదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలలోని మిస్సింగ్ కేసులను పరిశీలించి సత్కర పరిష్కారం చేయాలని ఆదేశించారు.