ఎస్సై గోపాలకృష్ణ సూసైడ్ పై తప్పుడు ప్రచారం... వారిపై కఠినచర్యలు: డిఐజి వార్నింగ్
కాకినాడ: సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ మృతికి పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటూ జరుగుతున్న ప్రచారంపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పందించారు.
కాకినాడ: సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ మృతికి పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటూ జరుగుతున్న ప్రచారంపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పందించారు. కొన్ని ఛానళ్లలో ఎస్సై మృతిపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని... ఈ అసత్య ప్రచారాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తన సున్నితమైన మనస్తత్వం కారణంగానే పోలీస్ శాఖలో ఇమడలేకపోయారన్నారు. తాను మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు సూసైడ్ నోట్లో గోపాలకృష్ణ పేర్కొన్నాడని తెలిపారు.
తప్పుడు ఆరోపణలతో పోలీస్ శాఖ మనో ధైర్యాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం మంచి పరిణామం కాదన్నారు. వ్వవస్త నిర్వీర్యం అయితే, పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అవుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైనా ప్రచారానికి పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు హెచ్చరించారు.