విజయవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరను సమర్పించిన సిరిసిల్ల భక్తుడు
ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో పట్టే చీరను సమర్పించాడు సిరిసిల్ల కు చెందిన భక్తుడు.
ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో పట్టే చీరను సమర్పించాడు సిరిసిల్ల కు చెందిన భక్తుడు. 45 వేల రూపాయలు ఖరీదు చేసే ఈ చీరను... ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామం నుండి వచ్చిన విజయ్ అనే భక్తుడు అమ్మవారికి అగ్గిపెట్టి లో ఈ బంగారపు చీరను సమర్పించాడు. చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదు అని ఈ సందర్భంగా సదరు భక్తుడు విజ్ఞప్తి చేసాడు.