Asianet News TeluguAsianet News Telugu

అరేయ్ దగుల్బాజీ వర్మ ... అలాంటి సినిమాలు తియ్యరా..: దేవినేని ఉమ

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై 'వ్యూహం' పేరిట ఓ సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీరియస్ అయ్యారు. 

First Published Aug 13, 2023, 3:18 PM IST | Last Updated Aug 13, 2023, 3:18 PM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై 'వ్యూహం' పేరిట ఓ సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీరియస్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ తో పవిత్ర సంగమం ప్రాంతాన్ని అపవిత్రం చేశారంటూ విమర్శించారు. పవిత్రమైన సినిమాల ద్వారా వాస్తవాలు చెప్పాలిరా సన్నాసి... పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ఎంత  బాగుపడిందో చెప్పరా దరిద్రుడా అంటూ మండిపడ్డారు. వర్మ లాంటి దగుల్బాజీలు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు వుండబట్టే రాష్ట్రం నాశనం అవుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు