Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మడానికి అసలు నువ్వెవరు..: జగన్ పై దేవినేని ఉమ సీరియస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ 'ఉక్కు పరిరక్షణ పోరాట సమితి' ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో టిడిపి శ్రేణులు బంధ్ చేపట్టాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ 'ఉక్కు పరిరక్షణ పోరాట సమితి' ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో టిడిపి శ్రేణులు బంధ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ... తాడేపల్లి రాజ ప్రసాదంలో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసారని... వారితో ఏ లాలూచీ చేసుకున్నారో ప్రజలకు చెప్పాలి? అని నిలదీశారు. అసలు ముఖ్యమంత్రి  ఎవరికి చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు? విశాఖ కార్మికులకు చెప్పారా ? ప్రజా ప్రతినిధులకు చెప్పారా? అని ప్రశ్నించారు. కేవలం తన స్వార్ధం కోసం, విశాఖ భూములు కొట్టేయాలి అని దుర్భుద్ధితో ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. 7 వేల ఎకరాలు అమ్మేస్తానని ప్రధానమంత్రికి ఉత్తరం రాశానని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నాడు... అలా రైతులు, ప్రజలు ఇచ్చిన భూములు అమ్మడానికి ఆయనెవరు? అని ఉమ ప్రశ్నించారు. 

Video Top Stories