Asianet News TeluguAsianet News Telugu

అంజనాద్రి అభివృద్దిపై ముందుకే... కోర్టు నోటీసుల ప్రచారంపై టిటిడి క్లారిటీ

తిరుమల: తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్ధలంగా టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంజనాద్రిని భక్తులకు మరింత చేరువ చేసేందుకు భారీ అభివృద్ది పనులకు టిటిడి సిద్దమయ్యింది. అయితే ఈ పనుల శంకుస్థాపనను నిలిపివేయాలని కోర్టు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. .అంజనాద్రిలో భూమి పూజ రద్దు చేయమని కోర్టు నుండి తమక ఎటువంటి నోటీసు అందలేదని... అందువల్లే యధావిధిగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కోర్టు ఆర్డర్ చూపితే దానిపై స్పందించేందుకు టిటిడి సిద్దంగా ఉందన్నారు.