Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ లో కర్రల సమరం... దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో 50 మందికి గాయాలు

కర్నూల్ : ఎక్కడయినా దసరా పండగరోజు ఒకరికొకరు బంగారం(జమ్మి) పంచుకుంటూ ఆత్మీయంగా ఆళింగనాలు చేసుకుంటుంటారు.

కర్నూల్ : ఎక్కడయినా దసరా పండగరోజు ఒకరికొకరు బంగారం(జమ్మి) పంచుకుంటూ ఆత్మీయంగా ఆళింగనాలు చేసుకుంటుంటారు. కానీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో మాత్రం ఇందుకు భిన్నంగా    అలజడి మద్యే దసరా పండగ జరుపుకోవవడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజున బన్నీ ఉత్సవాల పేరిట గ్రామస్తులంతా కర్రల సమరం చేస్తారు. ఒకరిని ఒకరు కర్రలతో కొట్టుకోవడమే బన్నీ ఉత్సవాల స్పెషల్. ఇలా ఈసారి కూడా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 50మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జోరు వానలోనూ కర్రలు చేతబట్టి బయటకు వచ్చి దాడులు చేసుకున్నారు. దీంతో పలువురి తలలు పగిలి రక్తం వర్షపునీటిలో కలిసి ప్రవహించింది. 

Video Top Stories