Asianet News TeluguAsianet News Telugu

పవన్ సాయం వద్దంటూ ఇప్పటంలో బ్యానర్లు... బాధిత మహిళల స్ట్రాంగ్ కౌంటర్

తాడేపల్లి : మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

First Published Nov 11, 2022, 1:11 PM IST | Last Updated Nov 11, 2022, 1:11 PM IST

తాడేపల్లి : మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇల్లు కూల్చివేతకు గురయిన బాధితులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అండగా నిలిచి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అయితే పవన్ చూపించే సానుభూతి, ఆర్థిక సాయం తమకు వద్దని కొందరు బాధితులు ఇళ్ల ముందు బ్యానర్లు, గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఈ బ్యానర్ల వ్యవహారంపై తాజాగా జనసేన పార్టీ నాయకులు, ఇప్పటంకు చెందిన బాధిత మహిళలు స్పందించారు. 

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులు 53మంది వుంటే వారిలో 8మంది మాత్రమే పవన్ కల్యాణ్ సహకారం అవసరం లేదని బ్యానర్లు కట్టుకున్నారని జనసేన నాయకులు తెలిపారు. ఇక తాము ఇంట్లో లేని సమయంలో కూల్చివేతలు చేపట్టారని బాధిత మహిళలు తెలిపారు. ఇళ్లు మొత్తాన్ని కూల్చడానికి ప్రయత్నించగా కత్తితో పొడుచుకుంటానని బెదిరించారని... అప్పుడు కేవలం ప్రహారి, మెట్లను మాత్రమే కూల్చారని ఏమినేని అన్నపూర్ణ అనే బాధిత మహిళ తెలిపారు. తమనే కాదు పిల్లలను సైతం బెదిరిస్తున్నారని మరో బాధితురాలు స్వప్న పేర్కొన్నారు.