బెజవాడలో చనిపోయిన గొర్రెల మాంసం విక్రయం... ఇద్దరు వ్యాపారుల అరెస్ట్
బెజవాడలో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ చనిపోయిన జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేసారు.
బెజవాడలో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ చనిపోయిన జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేసారు. భూపేష్ గుప్తా నగర్‌కు చెందిన శ్రీహరి మాణిక్యం, ఓబులేశ్వర రావు మాంసం వ్యాపారులు. వీరిద్దరు తమ లాభార్జన కోసం చనిపోయిన గొర్రెల మాంసాన్ని మార్కెట్ లో కేజీ 800 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నట్లు వెటర్నరీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ ఏ. రవిచంద్ సదరు మాంసం దుకాణాలపై దాడిచేసి నిల్వవుంచిన మాంసాన్ని గుర్తించారు. వ్యాపారులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసారు.వినుకొండ సంతలో చనిపోయిన గొర్రెలను 1500 నుంచి 2000 చొప్పున కొనుగోలు చేసి వాటి మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. వ కృష్ణలంక రాణిగారి తోటలో ఐదు షాపుల్లో చనిపోయిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు విచారణలో మాణిక్యం, ఓబులేశ్వర రావు తెలిపినట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.