Asianet News TeluguAsianet News Telugu

పల్నాడు జిల్లా కోర్టు ప్రాంగణంలో మృతదేహం కలకలం... హత్యా...ఆత్మహత్యా?

పల్నాడు జిల్లా కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం రేపింది. చిలకలూరిపేటకు చెందిన మహబూబ్ సుబానీ ఓ కేసులో నిందితుడిగా వున్నాడు. 

First Published Nov 4, 2022, 2:38 PM IST | Last Updated Nov 4, 2022, 2:38 PM IST

పల్నాడు జిల్లా కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం రేపింది. చిలకలూరిపేటకు చెందిన మహబూబ్ సుబానీ ఓ కేసులో నిందితుడిగా వున్నాడు. ఈ క్రమంలోనే అతడు రెండురోజుల క్రితం (నవంబర్ 2న) నరసరావుపేటలో కోర్టుకు హాజరయ్యాడు. అయితే కోర్టుకు వెళ్లినవాడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కోర్టు ప్రాంగణంలో ఓ మృతదేహం వున్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది సుభానీదే అని గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.